STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

వందనాలు

వందనాలు

1 min
2


పొదరింటిని అల్లుకునే..విరహాగ్నికి వందనాలు..! 

మౌనముగా అలరించే..ప్రేమాగ్నికి వందనాలు..! 


చూపులతో కట్టివేయు..కోమలాంగి నా ప్రేయసి.. 

అక్షరాల నాట్యమాడు..సరసాగ్నికి వందనాలు..! 


ఏమిత్రాగు నేమితినునొ..వివరించదు ఏమాత్రం.. 

నేర్పకనే నేర్పుచున్న..స్నేహాగ్నికి వందనాలు..! 


మదనపడే మనసుపట్టి..నిలిపివేయు క్షణములోనె.. 

ముచ్చటగా మంత్రించే..శ్వాసాగ్నికి వందనాలు..! 


విచిత్రముగ వెంటాడే..కోరికలను మసిచేయునె.. 

గంధాలను ఇగురబెట్టు..ధ్యానాగ్నికి వందనాలు..! 


నేనెవరో నీవెవరో..బంధాలకు అతీతముగ.. 

సత్యమేదొ విందుచేయు..త్రేతాగ్నికి వందనాలు..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics