వలపు వర్షం
వలపు వర్షం
వలపు వర్షం తెరలుగా కురిసి మనసులో
తలపు హర్షం తరలగా తరిమి ధనసులా
ఎద పొంగిలే ఎపుడులేని తన్మయముతో
ఆద మరిచెనే అదుపేలేని చిన్మయముతో
వలపు వర్షం తెరలుగా కురిసి మనసులో
తలపు హర్షం తరలగా తరిమి ధనసులా
వాలకం తెలిసాకా లోలకమే ఇక ప్రేమలో
ఆ లోకం అంది వచ్చినట్లు ఎన్ని భ్రమలో
వింత హొయలే మొదలై సుడులై ఆదిలో
ఎంతహాయో ఎరుగని సుఖం ఆ మదిలో
వలపు వర్షం తెరలుగా కురిసి మనసులో
తలపు హర్షం తరలగా తరిమి ధనసులా
మల్లె గులాబి అగరు పరిమళాలే నిండగ
వల్లె వేసే చెలియ పేరు పేరిమితో ఉండగ
మల్లె గులాబి అగరు పరిమళాలే నిండగ
వల్లె వేసే చెలియ పేరు పేరిమితో ఉండగ
జాగులేని సరసంలో జాలువారే సమరమేలే
వేగులా వచ్చే ఎలమికి ఎదలో అమరమేలే
కొండవాగూ నడకలో కొంటె తనమున్నటులే
ఉండలేని ఊసులూ ఊహలతో చేరినటులే
వలపు వర్షము తెరలుగా కురిసి మనసులో
తలపు హర్షము తరలగా తరిమి ధనసులా
ఎద పొంగినేడు ఎపుడులేని తన్మయముతో
ఆద మరిచెను అదుపులేని చిన్మయముతో

