విలువైన కాలం
విలువైన కాలం
గడచిన కాలం ఒక జ్ఞాపకమైతే
నీతో నే నిలిచిన కాలం వాస్తవమే గా
నీతో స్నేహం వెన్నెల నడక
మన ఇరువురి పయనం ఒకటే గమ్యం.
దిక్కుతోచని నావికునికి
దిక్సూచి లా నీవుంటావు
నడి సంద్రంలో చిక్కుకు పోయిన
చిత్తరువల్లే నేనున్నాను
గంటల్లో నువు తరుముకు వస్తే
క్షణాలలో నే పరుగెడతాను
మరలా నీతో అడుగే కలిపి
హాయిగ నీతో కలిసుంటాను
మనిషికి నేను చెప్పే దొకటే
గడచిన సమయం మరలా రాదోయ్
తెలివిగ నీవు నడచుకు రావోయ్
దారిలోపల జలగలుంటవి
అంటక, ముట్టక వేగిర పడవోయ్
తరుముకు వచ్చే తోడేళ్లుంటవి
తత్తర పడక బిరబిర రావోయ్
గుంటనక్కలు ఎదురుచూస్తవి
పొరపాటుగా.. ఆ ..దరికి వెళ్లకోయ్
కరిగిన కాలం మరలా రాదోయ్
చిక్కుల్లో నువు చిక్కులు పడకు
అత్యాశకు నువు అల్లుకు పోకు
ఉన్నదానితో సర్దుకు బ్రతుకోయ్
కాలమెంతో విలువైనది
సమయస్పూర్తి గా మసలుకుంటే
కష్ఠాలన్నవి కరిగిపోవును.

