విజయీభవ
విజయీభవ
శాంతికొరకు పోరాడే భరతమాత విజయీభవ
నవదుర్గల కనుసన్నల క్రాంతిదాత విజయీభవ
దుష్టులనే దునుమాడే చండిమాత రావాలీ
ప్రపంచానికెల్లప్పుడు ప్రేమదూత విజయీభవ
అలనాటీ ప్రాభవాన్ని ప్రసాదించు వరదాయిని
సంక్షేమం కోరుకునే కలలజోత విజయీభవ
జగదంబల కరుణతోటి గలగలలా గంగతోటి
సిరులొలికే సశ్యాలతొ భాగ్యదాత విజయీభవ
సంస్కృతులా సంప్రదాయ సమ్మేళనమీ భారతి
భువిఅంతా కీర్తించే విశ్వనేత విజయీభవ
