Gayatri Tokachichu

Inspirational

4  

Gayatri Tokachichu

Inspirational

వీరశివాజి

వీరశివాజి

1 min
297


. వీర శివాజి గాథలను విన్ననె కల్గును దేశ భక్తి సే

. వారతి యందు మున్గుచును భారత దాస్య విముక్తి గోరుచున్

. బోరుచు ప్రాణమొడ్డిరట బోసులు, బాల భగత్తులెందఱో

. వారి దలంచుకొంచు పర వారిని ద్రోలిరి దేశ పౌరులున్.//

. ప్రేరణ నిచ్చువారలగు పెద్దలు గాంధిజి నెహ్రు వల్లభుల్

. వీర సవార్కరుల్ కదలి బీరము తోడ జెలంగి పోఱగన్

. పాఱి విదేశ వాసులును భారత భూమికి స్వేచ్ఛ నీయగన్

. దీరెను కష్టముల్ కలసి దేశపు పౌరులు సంతసించగన్.//


Rate this content
Log in

Similar telugu poem from Inspirational