వీర తిలకం
వీర తిలకం
అణువణువునా దేశభక్తి ప్రభవించగా...
పురిటి గడ్డ మురిసే నిన్ను చూడ...
వీర తిలకం దిద్దిన సైనిక
మరణపుటంచుల నీ ఊపిరిక
కుటుంబాన్ని వదలి దేశ రక్షణలో నీవిక
ప్రాణాలు లెక్కచేయని తెగింపు నీదేనిక
కరుణ చూపని లోకానికి,
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న రాబందులకు
రాజకీయ ముసుగులోని రాక్షసులకు
నీవే కాపలాయిక...
కోటానుకోట్ల జనానికి నీవొక ఆశా జ్యోతి
సంతోష జీవితంతో మేము నీ నీడలో
నీవు కష్టాలని భుజాన మోస్తూ సరిహద్దుల్లో...
మాకెవ్వరికీ దక్కని భాగ్యం...
కన్న భూమి ఋణం తీర్చుకునే
ఆ భాగ్యం నీకే కలిగెను కదా..!
అయినా
స్వార్థ పూరిత లోకానికి నీ సేవలు కావాలి...
