మల్లెపూలు
మల్లెపూలు
మల్లెపూలు తురిమినట్టు నాజడలో నిన్నుబెడత
గరికకొమ్మ చేతబట్టి నీశృతినీ ఎండగడత
వాలుచూపు సందడిలో నీకృతినీ సల్లబెడత
నునుమోవీ సంగతితో నీకలనూ నేనౌతా
బావానువు రావానను ఏలుకొనగ నారాజా
నీకోసం ఎదురుచూసి అలసినాను రారాజా
నిన్నుచూడ మనసాయే మనమందున మారాజా
వేచివేచి వగచినాను నీదరినీ నుండుటకై
నామనసూ నీకిస్తిని నన్నుమనువు ఆడమనీ
నాతనువూ నీదేనని చాటింపూ వేయించితి
నామెడనూ పుస్తెకట్టి నీదానిని చేసుకోవ
నీ ఎదపై తనివితీర నాశిరమూ నుంచెదనూ
ఉల్లిపొరల కోకరైక సుందరాంగి కనుపించీ
జంటగోర సమ్మతించి ననుమరచా వనిపిస్తే
రిమ్మతెగులు తీస్తామరి వచ్చినేను కాళికలా
దిమ్మతిరిగి పోయేలా నిన్నుచేరి పార్వతిలా
