తోడుంది
తోడుంది
మదికంటి దీపాల..వెలుగులకు తోడుంది..!
చక్రార పంక్తింటి..తపములకు తోడుంది..!
మౌనముగ మాటాడు..వ్రతమాచ రించేను..
భోగాల పరువాల..వలపులకు తోడుంది..!
శతకోటి రాగాల..హరివిల్లు మానసం..
చెలిమినే శ్వాసించు..తరువులకు తోడుంది..!
ప్రేమించు సంగతిని..మరపించు ప్రేమమయి..
శుభప్రణయ గంధాల..గాలులకు తోడుంది..!
ప్రజ్వలిత చైతన్య..తత్వాంత రంగిణిరొ..
పేరంటు లేకుండ..పేరులకు తోడుంది..!
ప్రతి తనూ వీణియన..మార్మ్రోగు నాదమయి..
వేదాంత తీర్థముగ..జ్ఞానులకు తోడుంది..!
