STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

నవజీవనం

నవజీవనం

1 min
3

*నవజీవనం*(కవిత )


నిత్యం మదిని నలిపేసే భావతరంగం

బాధలనోర్చుకొంటూ తిరిగే జీవితం

మనసును దాచే సుష్కమందహాసం

భయమును మ్రింగే విఫల ప్రయత్నం

వెరసి జీవితమే అపజయాల రంగస్థలం

మనమిద్దరమూ గొప్ప పాత్రధారులం

యాంత్రికతతో నిత్యం మమేకమవుతున్నాం

స్వచ్ఛతకెప్పుడైనా ఇస్తున్నామా ప్రాముఖ్యం?

నువ్వూ నేనని తరగిపోనీయని దూరం దూరం

కొట్టుకు ఛస్తూ కోపోద్రిక్తులమవుతుంటాం 

పనికి మాలినట్టి సిద్ధాంతాలతో రాద్ధాంతాం!

చక్రభ్రమణంలో తిరుగుతున్నదీ కాలగమనం

ఏ గమ్యానికి చేరుస్తుందో ఈ కంటక మార్గం?

మరిచిపోయామా పెళ్లినాటి విశ్వాసాల ప్రమాణం!

ఎంతకాలమీ దాగుడుమూతల దాంపత్యం?

కూలిపోతున్నదీ సంసారమనే మహా వృక్షం

ఉదాసీనంగా ఉంటే మిగులుతుంది నరకం 

వద్దు!వద్దు!తరిమి వేద్దామీ సంఘర్షణం!

నిర్మలత్వానికి చెబుదామా ఘనమైన స్వాగతం 

నిజంగా జీవిద్దామా ఈ గృహంలో మనం మనం!

కల్లాకపట మెరుగని నవ నవోన్మేష ప్రపంచం

కళ్ళముందే సృష్టించి కదిలి కదిలి పోదాం!

గుర్తు తెచ్చుకుందామా మన సరాగాల ప్రణయం!

వెలికి తీద్దామా అనురాగపు రత్న మంజూషం 

పాడుదామా మళ్ళీ కలిసి మెలిసి మోహన రాగం!

చరిద్దామా మనమిద్దరం స్నేహితులమై క్షణం క్షణం!

ఆస్వాదిద్దామోయీ!తీయ తీయని ప్రేమ సుధాసారం!//


Rate this content
Log in

Similar telugu poem from Classics