కనావా
కనావా
బంగరు వెన్నెల..గనినే కనవా..!
తరగని మెఱుపుల నిధినే కనవా..!
చూపుల వానకు..ప్రాణము తానే..
వ్రాయని పాటల..గుడినే కనవా..!
చినుకుల తేనెకు..గంధము లద్దునె..
చెదరని సిగ్గుల..నదినే కనవా..!
సాక్షిగ బ్రతికే..తీరువ నేర్పునె..
అలజడు లంటని..చెలినే కనవా..!
పాడికి పంటకు..తోడుగ ఉండునె..
వెచ్చని మౌనపు..ధునినే కనవా..!
ముక్తికి వంతెన..విడిగా కలదా..
గుండెను నడిపే..తడినే కనవా..!
