మనసు తక్కెడ
మనసు తక్కెడ
మనసు తక్కెడపట్టుకొని
నా ముందు నిలబడి
ప్రశ్నల వర్షం కురిపించి
బందాల కొలతలు చూపిస్తుంది
ఏ లెక్కలు సరిపోని బంధాలను
ఎత్తి చూపిస్తూ
బావబందాలు ఒకవైపు
నటన బందాలు మరోవైపు
సరితూగడం లేదు.. ఏంటని
నన్ను నిలువునా నిలదీస్తుంది.
మనసుతో ముడివడిన బందాలను
అవసరాలతో ముడిపెడుతూ
మానవ జన్మ అర్థాలను వెతికితే
మనసు తక్కెడలో నిర్దోషినై నిలబడ్డాను

