దుఃఖం
దుఃఖం
దు:ఖమే శ్వాసగా..ముగిసెనా జన్మలే..!
ప్రణయమే పాటగా సాగెనా జన్మలే..!
మనసనే గూటిలో..వేవేల కోర్కెలా..
తీరకే తీరగా..ఎత్తెనా జన్మలే..!
మాటలే ఈటెలో..బాంబులో ఎందుకో..
బాధలో బాధగా..గడిచెనా జన్మలే..!
కారణం సరేలే..కోపమే మిత్రమా..
పొయ్యిపై పెనంలా..కాలెనా జన్మలే..!
అనుభవం ఇచ్చెనే..జ్ఞానమే చక్కగా..
వింతగా మాయలో..మునిగెనా జన్మలే..!

