సంక్రాంతి
సంక్రాంతి
హరిదాసు లేరంటు..అడిగేను సంక్రాంతి..!
చెలిచేతి ముగ్గుకై..చూసేను సంక్రాంతి..!
శంకరుని ధ్యానమది..కళ్యాణ కారణం..
పార్వతికి స్వాగతం..పలికేను సంక్రాంతి..!
కైలాస గిరికేగు..తలపింక చాలించు..
హృదయాద్రి పైచేర..మెచ్చేను సంక్రాంతి..!
సంస్కృతిని రక్షించు..సంప్రదాయము కాచ..
నిజసస్య లక్ష్మియై..వచ్చేను సంక్రాంతి..!
రైతన్న శ్రమదోచు..రాజులేం రాజులో..
నిజశోక తప్తయై..నిలిచేను సంక్రాంతి..!
గంగిరెద్దుల ఆట..మాయమై పోయెనా..
భోగిమంటను చూడ..వేచేను సంక్రాంతి..!
