ప్రతినిధిగా
ప్రతినిధిగా
పనిచేస్తూ బ్రతకనిమ్ము..నీ ప్రేమకు ప్రతినిధిగా..!
ఒక సాక్షిగ ఉండనిమ్ము..నీ మాటకు ప్రతినిధిగా..!
బంగారపు చేమంతుల..వాన'లోన కురియనిమ్ము..
నీ పాటలు పాడనిమ్ము..ఈ తోటకు ప్రతినిధిగా..!
అందలాలు అందమైన..బంధాలని ఏంచెప్పను..
ఈ'నేను'ను కదలనిమ్ము..నీ ధ్యాసకు ప్రతినిధిగా..!
దారిసరిగ తెలియకనే..ఎన్నికథలొ చరితకెక్కె..
ఈ భువిలో వెలగనిమ్ము..నీ కథలకు ప్రతినిధిగా..!
లెక్కలెల్ల ఇగిరిపోవు..చోటునెలా పట్టాలోయ్..
నా ఓటును వేయనిమ్ము..ఒకముద్దకు ప్రతినిధిగా..!
విష్ణుతత్వ మెంతైనా..శివునాజ్ఞకు లోబడియే..
సత్యమిదే చాటనిమ్ము..గురుబ్రహ్మకు ప్రతినిధిగా..!
