మల్లెతనం
మల్లెతనం
చూపలేని సమరానికి..దిగుతున్నది మల్లెతనం..!
చెప్పలేని యాతనేదొ..మోస్తున్నది మల్లెతనం..!
నిద్దురతో తగవాడగ..ఇష్టపడే స్నేహాలయ..
ప్రేమగాలి కబురులేవొ..చెబుతున్నది మల్లెతనం..!
పానుపుపై నలిగిపోగ..సిద్ధమైన ప్రియరాగిణి..
స'రసవీణ మీటగాను..చూస్తున్నది మల్లెతనం..!
మంచుపూల వానకోరి..పరితపించు రసమోహిని..
మోహానికి యమపాశం..పెడుతున్నది మల్లెతనం..!
చమత్కార చూడామణి..తానేనని చాటకనే..
పెదవింటికి అతిథిలాగ..ఉంటున్నది మల్లెతనం..!
నీలిజడతొ జగడమాడు..ధవళతేజ మహారాజ్ఞి..
జాబిలిపై తిరుగుబాటు..చేస్తున్నది మల్లెతనం..!
