STORYMIRROR

Midhun babu

Romance Classics

4  

Midhun babu

Romance Classics

స్నేహమాధుర్యం

స్నేహమాధుర్యం

1 min
373


ఒకతల్లి కనకున్నా ఒక్కటైన హృదయాలు

ఎల్లలంటులేని ఒక హృది సవ్వడులo 

కోపాలు అలకలు కసురులు

అన్నీ స్నేహానికి బానిసలు

విడివిడిగా ఉన్నా కలిసుండే జతగాళ్ళo 

ఓనేస్తం నీవేగా సర్వస్వం...


తోడునీడల స్నేహపరిమళo 

విరబూయు కుసుమాలo 

తానై నేను నేనే తానుగా బతుకు స్నేహితులo...! 


చిరకాలపు దోస్తులము మేమే 

సిరిమువ్వల సవ్వడులము మేమే

చిగురించే మా స్నేహం పల్లవులై

నానీడ తానై - తావెంట నేనై

సూర్యచంద్రుల స్నేహం మాది.

నింగినేలల బంధం మాది

విడివిడిగా ఉండే కలిసుండే హృది మాది...!


చూపరులకు చురుక్కు తాపసులకు తళుక్కు

తళుకు బెళుకుల తార చంద్రులము మేమే

ఏ దృష్టి తగలక ఈ సృష్టిన చిరకాలం ఉండగా మాస్నేహం 

ఓ కంట మముగనుమా ఓ ఈశా...!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance