విచిత్రమైన మనసు
విచిత్రమైన మనసు
కనిపించదు వినిపించదు విచిత్రమైన మనసు
మరిపించిన నశియించదు పవిత్రమైన మనసు
దూరపుకొండలుమనకూ నునుపుగా వుంటవి
దరిచేరితె మురిపించదు ఇష్టమైన మనసు
కావాలనుకున్నమనసు మనకెపుడు అందదు
స్పృశియిస్తే పరికించదు కఠినమైన మనసు
అగాథంలొ దాక్కుంటూ తనపనిని చేయును
రమ్మంటే రానంటది క్లిష్టమైన మనసు
దరికొచ్చీ వెనుదిరిగే వ్యక్తిత్వం తనది
అర్పించిన ప్రేమించదు వ్యర్ధమైన మనసు

