వెన్నెల
వెన్నెల
తనతలపుల మధురిమకే..పొలమారుతు ఉన్నది..!
తన పిలుపే వీనులలో..మార్మ్రోగుతు ఉన్నది..!
కలలరేవు దాటనీదు..రెప్పచాటు వీడదు..
కనుపాపల తోటలోన..కదలాడుతు ఉన్నది..!
హాయిగూర్చు పిల్లగాలి..మౌనవ్రతము దేనికొ..
చెలి ఊసుల అక్షరాలు..మరగబెడుతు ఉన్నది..!
నాకోసం నా చుట్టూ..నాలోపల తానే..
మధుమాసపు సోయగమై..చిందాడుతు ఉన్నది..!
పుస్తకాల అవసరమే..లేదన్నది నిజమే..
సందేహపు మూలాలను..ఎండగడుతు ఉన్నది..!
అనుభవాగ్ని యజ్ఞసాక్షి..నాట్యమాడు నేస్తము..
అనుక్షణం తోడుంటూ..వరాలిడుతు ఉన్నది..!
మర వెన్నెల జగాలకే విందుసేయ..ఊరేగుతు ఉన్నది.

