వెన్నెల
వెన్నెల


ప౹౹
వెన్నెల జాబిలి వన్నెలు వలపుల పిలుపులే
వెన్నలా వెలుగుతు వేళకు పెంచు తలపులే ౹2౹
చ౹౹
రాత్రి సమీరం ధాత్రినెల్ల ఆవరించెలే చల్లగా
మైత్రి కోసరం కలువలు వికసించెలే మెల్లగా ౹2౹
పున్నమి పూవూ విరబూసెనుగా పులకించి
నున్ననీ మేనూ నర్తించెలే ఆ సడి ఆలకించి ౹ప౹
చ౹౹
వలపు రధమెక్కీ వలరేడు చెప్పే వర్తమానం
గెలపుకోసం ప్రేమలో ఎదపై చేసెగ ప్రమాణం ౹2౹
చీకటివేళ కూకటీ వెలుగూ కూడి వచ్చేనులే
ఆ ఒకటి ఆ ఎలమే ఎడదనిండ మెచ్చేనులే ౹ప౹
చ౹౹
మిలమిల తారకలే మిణుగురువలే వెలిగెలే
కిలకిల రావములే కూడి కూరిమిగ మెలిగిలే ౹2౹
అన్నులు మది నిండే మమతలు పూరించిలే
వెన్నెలూ ఆది నుండీ అదనులో వూరించులే ౹ప౹