వెలుగులో దీపం
వెలుగులో దీపం
లాంతరు పెట్టి చదువుకున్న రోజులు గుర్తున్నవి,
మసిబారిన అద్దాన్ని తుడవం గుర్తున్నది.
మేడైనా పాకైనా తన జాడతోనే
వెలుగులు నిండినట్లు గుర్తున్నది,
వెన్నెలంటి వెలుగే
చైతన్యపు వెలుగుగా కనిపిస్తున్నది,
భయము భక్తి కలబోసిన చదువులే
కలల సాకారపు బాటగా తెలిసినది,
విద్యా ప్రగతికి అడ్డుగా వున్న పేదరికం
ముచ్చటైన దీపంతో గుండెగుబులు తీర్చినది.
రైతుకు నేస్తమై పొలంగట్లపై
పాములను తరిమినది,
ఆకాశపు నెలవంక ఇంటిలోనే ఉన్నట్లు చల్లని ప్రేమలకు సాక్షమై నిలిచినది,
ఆధునిక యుగంలో
ఉనికి చాటలేక
గతకాలపు
చిహ్నంగా మిగిలినది,
వైభోగపు లోగిలిలో
మమతల వెలుగులు చూడలేని లాంతరు(కందిని)
నిజసమాధి స్థితిలో దర్శనమిస్తున్నది.
