వెలుగు చెట్లు నాటదాం!
వెలుగు చెట్లు నాటదాం!
---------------------------------
చక్రనేమిలో పడిన జీవితం
బరువు బాధ్యతలతో మమేకం.
నిత్యమేదో విరామం లేని పోరాటం
నిట్టూర్పుల మధ్య సాగే ప్రయాణం.
జంతుజన్మలా బ్రతుకు నీడ్వటం
అంగలు చాచి అలసి పోవటం
ఇదేనా మనకున్న మేధావిత్వం?
కాస్త ఆగి ముందుకు చూడుమా నేస్తం!
గట్టిగా ఊపిరి పీల్చి నిలబడవా ఒక నిమిషం!
కొంగొత్త మార్పులతో ప్రకృతి నేర్పించలేదా నిత్య నూతన శోధనం
నూతన సంవత్సరంలో
ఆకాంక్షలతో ఆశలతో కొత్త అడుగులతో ప్రయాణం
మొదలు పెడదామా మనం మనం.
చేయి చేయి కలుపు మిత్రమా!
కారుచీకటి బాటలో వెలుగు చెట్లు నాటదాం.
మోడువారిన జీవితాలకు బంగారు భవితనిద్దాం.
మరో మంచి శకానికి మమతల పునాది వేద్దాం.
మంచిని పెంచే జ్ఞాన నిధులతో
మరో ప్రపంచం నిర్మిద్దాం.
క్రొత్తఅడుగు వేద్దాం!క్రొత్త అడుగు వేద్దాం!
-------------------------
