Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

jayanth kaweeshwar

Drama

5.0  

jayanth kaweeshwar

Drama

వెల్లి విరిసెను -- కవితా గీతం

వెల్లి విరిసెను -- కవితా గీతం

1 min
410


వెళ్లి విరిసెను- వచన కవిత గీతం


వెల్లి విరిసిన నవ వసంతం – మధుర ఆలోచనల దిగంతం

చిన్ననాటి జ్ఞాపకాల దొంతర – అప్పుడు , ఇప్పుడూ జరిగిన సంబరాల జాతర


ఖమ్మం మెట్టు లో గడిపిన నర్సరీ – అక్కడి స్థానిక ప్రదేశాల వర్ఝరి

నల్లగొండలో నేర్చిన శాఖా– యాది కొచ్చిన పాటల లహరిని పదిల పర్చు కున్న రేఖ


ఆదిలాబాద్ లో శిశుమందిరంలో చదువు – అప్పటి చూ సిన సినిమాల నెలవు 

స్నేహితులతో గడిపిన క్షణాలు – పరివారం తో జరుపుకొన్న పండుగలు


కరీంనగర్ లో గడిపిన పండుగ సంబురాల అనుబంధం – గ్రంథాలయం లో పుస్తకాల పఠనం

శిశు మందిరం లో చదువు – నాటికల ప్రదర్శన పాటల పోటీలో చూపిన చొరవ


దర్శించిన ఎన్నో ముఖ్య ప్రదేశాలు – అవి అన్నీ చిరస్మరణీయాలు


నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకం – సుబ్బులక్ష్మి గారి సంగీత కచ్చేరి

మేము జరుపు కున్న బ్రతుకమ్మ, దసరా పండుగ ,- మరపు రాని అనుభూతులు

అప్పటి నగరం ఇప్పుడు మారుతున్నా మూలాలు పదిలం


నానమ్మ ఊరిలో బంధువులతో ఆడిన ఆటలు ,గడిపిన క్షణాలు మరువలేనివి

అమ్మమ్మ ఊరిలో చూసిన వీధి నాటకాలు, చదివిన జానపద, అ.ప.నల కథలు


జరుపుకున్న పండుగలు , రేడియో కార్యక్రమాలు వినడం జ్ఞానాన్ని పొందడం

పల్లెల సుందర దృశ్య కావ్యం – అభివృద్ధి ప్రగతికి మూలం .


---- కవీశ్వర్ . జయంత్ కుమార్ . రాజేంద్రనగర్ , హైదరాబాద్


Rate this content
Log in

Similar telugu poem from Drama