వెగటైందా బుజ్జికన్నా
వెగటైందా బుజ్జికన్నా
వెగటైందా బుజ్జికన్నా!
పాతికేళ్ళుగా
నిన్ను హత్తుకున్న
కన్నప్రేమ....
ఇన్నేళ్ళూగా
చూసిచూసీ
వెగటైందా నాబుజ్జికన్నా
!!
కొత్తగా
కనబడిన
నీ యీడుమనిషి
ప్రేమకై తపిస్తూ
నన్నొదిలేసి వెళుతున్నావ్
మా ప్రాణాలు
నీలోనేపెట్టుకున్నాం
జాగ్రత్త బుజ్జికన్నా!
నీ సంతోషమే
మాకు కావాలి
నీకేమన్నా అయితే మేంబ్రతకలేం
ఆ విషయం మరువబోకు
ఆపదల్ని కొనితెచ్చుకోకు!
గాదిరాజు మధుసూదన రాజు