STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

వేళాయెను

వేళాయెను

1 min
156

చిరునవ్వుల లలితాంగీ విశ్రమించు వేళాయెను..!

మరుమల్లెలు మెలమెల్లగ పరిమళించు వేళాయెను..! 


జాబిలికే చల్లదనము నింపు చూపు నీదేలే..!

ముంజేతుల కంకణాలు పలుకరించు వేళాయెను..!


వెన్నెలేమొ అంటున్నది గుసగుసగా ఆ గాలితొ..!

ఈ నందన వనమేమో పరవశించు వేళాయెను..!


పూలఋతువు పాన్పు వేసె మనకు సాక్షి తానవ్వగ..!

పెండ్లిపీటమల్లె పుడమి పులకరించు వేళాయెను..!


కనులోన కనులు కలుప బిడియమేల ప్రియ సఖియా..!

నీ మోమున ఆ కుంకుమ సందడించు వేళాయెను..!



Rate this content
Log in

Similar telugu poem from Romance