STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

వేడుక

వేడుక

1 min
315

మిత్రులందరికి ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు

౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼


వేకువెంత వేడుకో రెండు ఎదలకూ తెలుసుకో

అణుకువంత పొదివి అరమరికలేక కలుసుకో

రాబోయే వెలుగులో రాగాలాపానలే సాగించు

కాబోయే కాంక్షితాలూ ఊహాలాపనై ఊగించు

లేత మనసుకు లేమిలేని ప్రేమలను అందించి

పోత పోసిన బంగారమై సింగారమే చిందించి

వేకువెంత వేడుకో రెండు ఎదలకూ తెలుసుకో

అణుకువంత పొదివి అరమరికలేక కలుసుకో


గుప్పెడంత గుండెకూ గుర్తులన్నీ వివరించాల

ఇప్పుడంత వలపునూ వదలకా సవరించాల

చప్పుడేలేని సరిగమలై తలపునూ వరించాల

అప్పుడేరాని కలలనూ అవసరమై వర్ణించాల

ఎరుకలేని స్పర్శలో ఎడద పులకించిపోయెనే

మరుపులేని జ్ఞాపికే మదిలోన నిలిచిపోయెనే


వేకువెంత వేడుకో రెండు ఎదలకూ తెలుసుకో

అణుకువంత పొదివి అరమరికలేక కలుసుకో

రాబోయే వెలుగులో రాగాలాపానలే సాగించు

కాబోయే కాంక్షితాలూ ఊహాలాపనై ఊగించు


క్షణమొక యుగమే క్షతగాత్రుని చేయకుండునే

తక్షణమే ఆ తరుణి తలపులో నిలువకుండినే

క్షణమొక యుగమే క్షతగాత్రుని చేయకుండునే

తక్షణమే ఆ తరుణి తలపులో నిలువకుండినే


వేకువెంత వేడుకో రెండు ఎదలకూ తెలుసుకో

అణుకువంత పొదివి అరమరికలేక కలుసుకో

రాబోయే వెలుగులో రాగాలాపానలే సాగించు

కాబోయే కాంక్షితాలూ ఊహాలాపనై ఊగించు

లేత మనసుకు లేమిలేని ప్రేమలను అందించి

పోత పోసిన బంగారమై సింగారమే చిందించి


Rate this content
Log in

Similar telugu poem from Romance