వచన కవితలు
వచన కవితలు
1 min
1.1K
సాయంత్రం ఆరైతే
ఆరుబయటనే జనం
ఒక్కుమ్మడిగా కూర్చుండి
బాతాఖాని చేస్తుండ్రు
కరొనా పై భయం లేదు
ప్రాణాలపై ఆశ వున్నా
మనదాకా వస్తేను
అప్పుడేమో చూద్దాము
అంటూ
కాలం వెళ్ళ దీస్తున్న
జనాలకు ఏమాత్రం
జ్ఞానోదయం ఇప్పటికీ రాలేదు....
కనులు మూసినా నీవాయే
కనులు తెరిచినా నీవాయే
కలలోనైనా నీవాయే
మరి అందరి ఎదలు బేజారాయె....
లాక్డౌన్ వున్నా కూడా
రాకపోకలెక్కువే
సామాజిక దూరం మాత్రం
పాటించక పోతున్నాం
ఎన్మివిధాలా చెప్పినా
ఈ చెవిటి మా లోకానికి
ప్రయోజనం లేదన్నదే
జగమెరిగిన వాస్తవం...