వాన
వాన
మకరందం దాచిన
మరుమల్లెలా
నాపై కురిసిన వాన....
రంగులు పొదుగుకున్న
ఇంధ్రధనస్సులా
నన్ను తాకిపోవా వేళ....
నిన్ను చూడాలనుకునే
అందమైన స్వప్నంలా
ఇలా వచ్చే అలా వెళ్లిపోతా వేళ ....
మా ఉత్సాహం మనస్సుని
ఊయలూపే ఊహలా ఉండిపోకు
మళ్ళీ మళ్ళీ రా.....
రెక్కలు విచ్చుకుంటున్న
పువ్వులోని ఆత్రంలా
నీకోసం ఎదురు చూస్తూ ఉంటాo
నీ కోసం ఎదురుచూపులోని
అపురూపమైన హాయిలా
పెదవి పైకి రాలేని
మధురమైన ఊసులా...
కళ్ళు మాటాడే కమనీయ
భావార్థంలా
నీ స్పర్శ చెప్పే
మనస్సుకు ధైర్యం
నీ చెంత ఎంతో ఉత్సాహం
ఓ మధురమైన వాన మా చెంత నుండి పోవా

