వాన సాక్షి
వాన సాక్షి
కాల్చుతున్న వానసాక్షి..మనసునెలా నిలిపేది..!
వెలుగుతేనె రహస్యాల..గగనమెలా చేరేది..!
రావుసరే కనులెదుటకు..చేరరావె కలలోకి..
కోటియలల కడలి గుండె..ఘోషనెలా పాడేది..!
మాయంటే నీదేలే..వేదింతువు తియ్యగా..
పొంగు వలపు గంధాలకు..కట్టనెలా వేసేది..!
కాటుకతో పోటీపడు..చీకటినే త్రాగనా..
పసిడిపూల నిప్పులింటి..దృశ్యమెలా చూపేది..!
వణుకుతున్న అధరాలను..నిలుపుతీరు తోచదే..
ప్రణయవీణ రాగాలకు..అద్దమెలా పట్టేది..!
అలముకున్న అలజడులే..అలరించుట జరుగునా..
శాంతించని పూలనావ..భారమెలా మోసేది..!

