వాలు కనులు సిగ్గులు
వాలు కనులు సిగ్గులు
వాలుకనుల సిగ్గుతెఱలు..వర్ణించుట నాతరమే..!
వాలుజడకు హొయలెంతో..చూపేయుట నాతరమే..!
నీ చెక్కిట విరబూసే..గులాబీలు ఇన్ని చాలు..
నీ పూజకు అక్షరాలు..అర్పించుట నాతరమే..!
వెన్నెలతో జగడమాడు..వెర్రితనం వదిలేనా..
చూడలేని కనులు కాస్త..మూసేయుట నాతరమే..!
పెదవులతో మాటలాడు..సంకటమిక వద్దంటా..
నీనవ్వుల మెఱుపులింట..దాగుండుట నాతరమే..!
జాణతనపు చిరునామా..ఎఱుకలేని బ్రతుకాయెను..
పలుకరాని పిచ్చితనము..కోల్పోవుట నాతరమే..!
బంగారపు వెలపెంచగ..చూడకలా ఓ చెలియా..
పసిడి చందమామ ఒడిని..పడిపోవుట నాతరమ

