వాకిట వయ్యా రి
వాకిట వయ్యా రి


ప౹౹
వాకిట నిలిచిన వయ్యారి వగలూ దాచుకో
కిటకిట చూపులో చిక్కిన నగవులే దోచుకో ౹2౹
చ౹౹
కలహంసలకే కలహం మనసులో మరువక
జల కన్యలకే జలతారు అల్లినట్లూ ఎరువక ౹2౹
ఎక్కడిదమ్మా ఈ అందం ఎదను తొలిచిందీ
చక్కనిదమ్మా ఆ చందం తననిల తలచిందీ ౹ప౹
చ౹౹
ఓర చూపుల జడి వదిలిన వాడి బాణమేలే
తారతళుకులే తాయిలమై తీసేది ప్రాణమేలే ౹2౹
దాచిన సొగసు దరహాసమై తీరే మారెనులే
వేచిన వయసు వేసారి వేగిరమూ జారినులే ౹ప౹
చ౹౹
హంస నడకలే హింస చేసినే హృదయంలో
పంచ ప్రాణాలు పరవసించెనే ఆ కాయంలో ౹2౹
వాకిట నిలిచిన వయ్యారి వగలూ దాచుకో
కిట కిట చూపులో చిక్కిన నగవులే దోచుకో ౹ప౹