ఊపిరిలో ఊహగా
ఊపిరిలో ఊహగా
నా మదిలో నిత్య దస్తూరివై ప్రతి పదం లో
నా ఊపిరిగా ఇమిడిపోయావు....
నా హృదయం లో నీ ఊసులతో
అల్లుకుపోయావు అక్షరాల పందిరి......
మధురమైన రాగానికి పల్లవిపై
ఆదరాల సందిట నిలిచి పోయావు.....
అరమరికలు లేని అనుబంధాల సందడితో
ఊసుతో పనిలేకుండా ఊపిరిలో ఊహాగా కలిసిపోయావు....

