ఊపిరి
ఊపిరి
దోసిటపట్టిన
ఊహాలకి
ఊపిరి పోసాను!!
మనసాకసాన
మతాబులై నీకు వినిపించి
నీ హృది కితాబులో
లికించబడతాయని...
ఆశలు ఆవిరి అవకుండా
కంటి కలంతో మనసు పేపరుపై ఊసులతో
లేఖను రాశాను...
నీ ఏదవాకిటికి విరితోరణమై నిలవాలనీ
పుడమికి వెన్నెల దీపం అయినట్టు.. నీ నట్టింటి
దీపమై వెలగాలనీ
నింగి, నేల ఆశీస్సులతో తలపుల పరిమళాలను..
వలపు వసంతరాగాలాపనతో..
నీ నే కాకుండా మన అనే మదురాభూతితో... కలగాని నిజమై
దేవుడి వరమై
ఆత్మీయబందమై
కన్నవారికి కనువిందు
చేద్దామురా...

