Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

ఊహవై..

ఊహవై..

1 min
276


ఊహవై వస్తావు౼ ఊసులెన్నో వినిపిస్తావు

కంటికే కనిపించవు౼ మంటలే మండిస్తావు

కలలోను వదలవు౼ కలవరమే మిగిల్చేవు

ఎన్ని కలలో ఎదలో౼ ఎరవకనూ రగిల్చేవు

ఊహవై వస్తావు౼ ఊసులెన్నో వినిపిస్తావు

కంటికే కనిపించవు౼ మంటలే మండిస్తావు


దూరానా నింగి నేలా ఎలా కలిసెనో చూడు

తీరానా లంగరొదిలిన నావ ఏమైనదో నేడు

కన్నీరింకిన కళ్ళతోనూ కథలెన్నని చెప్పను

కన్నీరింకిన కళ్ళతోనూ కథలెన్నని చెప్పను

కలలోను వదలవు౼ కలవరమే మిగిల్చేవు

ఎన్ని కలలో ఎదలో౼ ఎరవకనూ రగిల్చేవు


గతం చూస్తే గమనమే సాగదు ముందుకు

మనోగతం అసలే నీవు తెలపవు ఎందుకు

చిక్కుముడులే వేసి చింపిరి తుంపరేస్తావు

దిక్కులేని ప్రేమను చేసి దాన్నిపాతరేస్తావు

ఊహవై వస్తావు౼ ఊసులెన్నో వినిపిస్తావు

కంటికే కనిపించవు౼ మంటలే మండిస్తావు

కలలోను వదలవు౼ కలవరమే మిగిల్చేవు

ఎన్ని కలలో ఎదలో౼ ఎరవకనూ రగిల్చేవు


Rate this content
Log in

Similar telugu poem from Romance