STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

ఊహలే

ఊహలే

1 min
7


కలనైనా ఇంతల్లరి..పెడతావని ఊహలేదు..! 
నీవుగాక తోడెవరో..ఉంటారని ఆశలేదు..! 

ప్రవాహానికెదురీదే..సాహసమది వరమేలే.. 
ఒక మానని గాయంలా..బ్రతకాలని తెలియలేదు..! 

ఛాదస్తం అనుకుంటే..అనుకోనీ ఎవరైనా..  
నిన్నుగూర్చి గాకుండా..పాడాలని తోచలేదు..! 

ధర్మమెలా ఉంటుందో..న్యాయమెలా చేయాలో.. 
లోకంలో ఎవ్వరికో..నేర్పాలని ఇచ్ఛలేదు..! 

త్యాగమేమి చేయాలట..లేని-'నాది' గాకుండా.. 
ఈ సిగ్గుల వెన్నెలనే..మోయాలని కాంక్షలేదు..! 

సమయమిదే జారిపోవు..వల్లెవాటు సమమాయె.. 
వేదించే జవారాలిని..వదలాలని తపనలేదు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance