ఊహా ప్రపంచంలో....శ్రీనివాస భార
ఊహా ప్రపంచంలో....శ్రీనివాస భార


నన్ను
నడిపించిన నాన్న
భుజాల సింహాసనం మీద
సంగీతం లా
జోలపాడేఅమ్మ
అడుగేస్తే
కందిపోతానేమో
అనే నాన్నమ్మ..తాతయ్యలు
ఆడించే
బాబాయ్ పిన్నిలు
వచ్చిపోయే
అమ్మమ్మ ..తాతలు
ఇందరున్న
సామాజ్ర్యం
నా ఊహల్లోనే
విడిపోయారో
మరణించారో
వదిలేసారో
నన్ను...ఒంటరిని చేసి
మీరు మాత్రం
సుఖపడ్డారు
అప్పుడే
నా ఉసురు తీసేసి ఉంటే
ఇంతకంటే
చాలాబాగుండేది
:::::::%%%%%%::::::::::