ఉత్తరం ఊసులు
ఉత్తరం ఊసులు


ప౹౹
వెన్నెల రాత్రులు ఎద సృతులు నే రాయనా
చల్లని చందమామను రమ్మని పిలిచేయనా ౹2౹
ప౹౹
వెలికివచ్చే భావాలూ వెనుతిరిగి చూడకనే
పలికి వచ్చే పదాలూ మరి నిలిచే వాడకనే ౹2౹
కారణమేదైనా కలసివచ్చేనూ ఆ తరుణం
కారకమేనడిపి రాయించే తీర్చ లేఖారుణం ౹ప౹
చ౹౹
ఉత్తరమంతా ఊపిరే సలుపనీ ఊసులేను
ఉత్తమమైన కబుర్లూ కురిపించి రాసులేను ౹2౹
రాస్తున్నాలే రంగరించి రాయంచా నడకలా
వస్తున్నాలే నీకోసం ఎదురే మరి చూడకలా ౹ప౹
ప౹౹
పండుగే పల్లవించే మదిలోన మారాకువేసి
నిండుగా విషయాలు ఆ లేఖతోనే చేరవేసి ౹2౹
అన్ని సంగతులు అడగకనే అందులో రాసి
కొన్ని గురుతుల్ని కోమలంగా మురిపించేసి ౹ప౹