ఉత్తర సందేశం
ఉత్తర సందేశం


ప౹౹
నీకు నాకూ మధ్య ఉత్తరమేగా ఊసులు చెప్పేది
రేపు మాపు రాసుకుంటేనే భావాలు పురి విప్పేది ౹2౹
చ౹౹
మేఘసందేశం పంపనూ కాళిదాసునూ కాదుగా
అమోఘ ఆవిష్కరణకీ ఏ మహత్యము లేదుగా ౹2౹
మామూలూ కాగితం చాలులే మనసు విప్పనూ
అమూల్యముగ చెప్పనా అసలు ప్రేమ గొప్పనూ ౹ప౹
చ౹౹
గుండెలో గుబులు చెప్పునే గుదిగుచ్చి గురిగాను
ఎండమావుల్నే పండువెన్నెల్లా చూపునే సరిగాను ౹2౹
కల్పనలెన్నో కనువిందుగా రాయొచ్చూ కవితతో
పరికల్పనలెన్నెన్నో ప్రేమికులా ముందరి భవితతో ౹ప౹
చ౹౹
రోజు రాసుకునే ఊసులకు ముహూర్తాలెందుకూ
బాజా భజంత్రీలు అవసరమే లేదులే చెప్పేందుకు ౹2౹
ఎదలో మొలచినా ఎలిమికి ఊపిరిలూదే ఉత్తరం
సొదలేక ఆ సొగసూ అందించినే అలా తరంతరం ౹ప౹