STORYMIRROR

Midhun babu

Romance Fantasy

3  

Midhun babu

Romance Fantasy

ఉత్తిమాట

ఉత్తిమాట

1 min
2


తనకన్నా ముద్దుగుమ్మ..ఉండటమా..ఉత్తిమాట..!

తనే లేక ఒక్కక్షణం..బ్రతకటమా..ఉత్తిమాట..!


గుండెలయల కోవెలలో..పసిడిబొమ్మ తానేగా

ఎటుచూస్తే అటు తానే..మరువటమా..ఉత్తిమాట..!


కనుసైగతొ శాసించును..వేనవేల లోకాలను..

తన అడుగుల జాడలనే..వదలటమా..ఉత్తిమాట..!


చిరునవ్వుల నెలవంకల..పుట్టినిల్లు తన హృదయం..

ఆ వెన్నెల వనము లేక..ఆడటమా..ఉత్తిమాట..!


కొండలోయలన్నింటికి..అభిషేకం తన చూపుతొ..

తన తియ్యని ధారలేక..పాడటమా..ఉత్తిమాట..!


Rate this content
Log in

Similar telugu poem from Romance