STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

ఉంటావు

ఉంటావు

1 min
1


కనుబొమల నడుమనే..వెలుగుతూ ఉంటావు..! 

కనువారి కోసమే..వెతుకుతూ ఉంటావు..! 


సాక్షిగా ఉంటూనె..నడిపించు నేస్తమా.. 

చిత్రముగ తేడాలు..చెరుపుతూ ఉంటావు..! 


నీ ప్రేమ మాటలకు..లొంగనిది అందనిది.. 

నిజమౌన గంగవై..పొంగుతూ ఉంటావు..! 


పాడుకో తలచగా..నిండేవు హృదిలోన.. 

స్వరసుధా పాతమై..దూకుతూ ఉంటావు..! 


ఈ మనసు గంధాల..మాయేల తొలగేను.. 

ప్రశ్నగా నేనుంటె..నవ్వుతూ ఉంటావు..! 


భావాల మాలతో..అర్చింప నేనెంత.. 

నా ధ్యాన సుమమాల..కోరుతూ ఉంటావు..! 


Rate this content
Log in

Similar telugu poem from Romance