ఉన్నదేమో
ఉన్నదేమో
నిన్ను గూర్చి గాక ఇంక..తలచుకోను ఉన్నదేమి..!?
నీ మహిమది గాక చూడ..పాడుకోను ఉన్నదేమి..!?
సంప్రదాయ మాధురియే..అద్దమాయె నీదయతో..
నన్ను-నేను గాక ఇంక..దిద్దుకోను ఉన్నదేమి..!?
దొరకలేదు ఈ జన్మము..ఇలా నేను కోరకుండ..
హృదియే నీ దేవళమే..తెలుసుకోను ఉన్నదేమి..!?
అటుఇటు పరుగులు తీస్తూ..ఆడుకొంటి నాతోనే..
నీవు-నేను వేడుకలో..చూసుకోను ఉన్నదేమి..!?
మేలుకొలుపు రాగమేదొ..జోలపాడు సంగతేమొ..
నాలోపలి నీ లీలయె..చెప్పుకోను ఉన్నదేమి..!?
కురులతోటి కబురులాడు..వినోదమే ఈ గాలికి..
ఈ మనస్సు సందడిలో..పట్టుకోను ఉన్నదేమి..!?
