ఉన్నానా
ఉన్నానా
మౌనానికి మరుపులద్దు భావంలా ఉన్నానా
మదిపాడే గీతానికి రాగంలా ఉన్నానా
దుఃఖాన్నే కాలానికి కానుకగా ఇచ్చేస్తూ
హసితాలను హత్తుకున్న కెరటంలా ఉన్నానా
జ్ఞాపకాల గాలితాకి తలపు తల్లడిల్లుతోంది
చిరుననవ్వుల చెలిమిలేని మౌనంలా ఉన్నానా
కలలలోన రంగులెన్నొ కనులుగెలుచు కోవాలని
శూన్యమైన వీధుల్లో స్వప్నంలా ఉన్నానా
ఓటమినే స్వాగతించు అలసిపోని గెలుపునేను
సింధువులో మెరుస్తున్న ముత్యంలా ఉన్నానా
ఊహలోకపు హృదయంలో పల్లవించు అనురాగం
మమకారపు మధువనిలో భ్రమరంలా ఉన్నానా ...

