తప్పనిసరి
తప్పనిసరి
గోర్వెచ్చని మంచినీరు..సేవించుట తప్పనిసరి..!
కాలుష్యము నివారించు..పనిచేయుట తప్పనిసరి..!
నైరాశ్యత తొలగించే..మందులేవి దొరకవులే..
భయమువీడి జాగ్రత్తలు..పాటించుట తప్పనిసరి..!
మహమ్మారి ఏమిలేదు..మనవికృత చర్యలఫలం..
చంపుకుతినే పనులనింక..వదిలేయుట తప్పనిసరి..!
ఓజోన్ పొరకు హానెంత..చేసినామొ చేతులార..
ఆధిపత్య పోరులింక..నిలిపేయుట తప్పనిసరి..!
మనిషితనం దైవత్వం..లేవుకదా విడివిడిగా..
సత్యమెరిగి శాంతముగా..జీవించుట తప్పనిసరి..!
మన ప్రయోగశాలలో..జీవులెన్ని బలి ఇస్తిమి..
రాక్షసత్వ మికనైనా..చాలించుట తప్పనిసరి..
