STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

తప్పదుగా

తప్పదుగా

1 min
3


మాట ఇచ్చి వెళ్ళినావు..చూసుకోగ తప్పదుగా..!

ప్రతిశ్వాసా నీలోనే..కలుపుకోగ తప్పదుగా..! 


శరీరాలు దూరమైన..తీరిపోవు బంధమిదా.. 

ఆలోచన నవ్వేనా..పంచుకోగ తప్పదుగా..! 


మానని ఈ గాయంతో..ఎన్ని ప్రేమగేయాలో.. 

పాడుకునే కోకిలనే..పట్టుకోగ తప్పదుగా..! 


చేతులెన్ని చాచినదో..చెప్పలేను అది ఎవరో.. 

సుడిగాలై నువ్వు వచ్చి..చుట్టుకోగ తప్పదుగా..! 


చెలిమికన్న అపురూపం..లేదుకదా ఏ జగాన.. 

తలపుతలుపు గడియపెట్టి..అల్లుకోగా తప్పదుగా..! 


అనుభవాల పంజరాన..సాక్షియైన రాచిలుకను.. 

ఒక్క లిప్తపాటు ఇంక..హత్తుకోగ తప్పదుగా..! 



Rate this content
Log in

Similar telugu poem from Romance