తొలి వలపు
తొలి వలపు
తొలి చూపులో ఉన్న మాధుర్యం
తొలి పలుకులో జాలువారు అమృతం
తొలి అడుగులో కలిగే తడబాటు
తొలి తొలకరిలో వచ్చే సౌరభం
తొలి గానంలో ఒలికే సరాగం
తొలి ప్రేమలో ఏర్పడే అలౌకిక బంధం
నీతో నేను పొందిన అనుభూతులు చెప్పనలవి కావు.
నీతో జరిగిన తొలి పరిచయం
నన్ను బంగరు మీనంలా ప్రేమమయ
సాగరంలో కేరింతలు కొడుతూ ఈదేలా చేసింది.
నీతో కలిసి వేసిన తొలి అడుగు నన్ను మేఘమాలికను చేసి
అనంత లోకాలలో విహరించేలా చేసింది.
నీతో కలిసిన నా తొలి చూపు నన్ను ఎన్నటికీ వీడని అనుబంధపు
ఆవరణలో బంధించి వేసింది...

