తనువు చూపు వెన్నెల
తనువు చూపు వెన్నెల
తనచూపుల వెన్నెల నను..అల్లుకునే ఉన్నది..!
విరహాగ్ని ధునిలో తోసి..కాల్చుతునే ఉన్నది..!
హరివిల్లుల వెల్లువయే..తననవ్వుల వానా..
గుండెగొంతు గానంలో..పొంగుతునే ఉన్నది..!
ప్రేమకెంత సిగ్గంటే..పెదవి విప్పలేదే..
నేలజూచు కన్నులింట..మరుగుతునే ఉన్నది..!
తనువేమో చిత్తరువై..చేరెకదా మదిలో..
అలుకెరుగని చెలి మనస్సు..పొగలుతునే ఉన్నది..!
అనుభవాల అద్దంలా..నిలచుకదా కాలం..
నిశ్చలమౌ సాక్షిలాగ..వెలుగుతునే ఉన్నది..!

