STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

తన మౌనం

తన మౌనం

1 min
4


చిరునవ్వుల కోవెలలో..దీపమంటె తన మౌనం..!

నిత్యచైత్ర రాగాలకు..కావ్యమంటె తన మౌనం..!


అనుక్షణం ప్రేయసియై..ఊరించే చెలి ఎవరో..

చెలిమిపూల వనసీమల..రాజ్యమంటె తన మౌనం..!


ప్రాణాలకు ప్రాణంలా..ఉన్నదెవరొ చూడవేమి..

గుండెగూటి పాపాయికి..లోకమంటె తన మౌనం..!


పెదవులపై నాట్యమాడు..మెఱుపులతో జగడమేల..

పరిమళించు ఆ చూపుల..గీతమంటె తన మౌనం..!


ప్రవహించే సెలయేఱుల..గలగలలో ఎన్ని కథలు..

క్రీడించే పదసీమల..భావమంటె తన మౌనం..!


Rate this content
Log in

Similar telugu poem from Romance