తన హసం
తన హసం
తన హాసం తో ఆకాశంలోనే కాదు
అవని అంతా మెరుస్తున్నాడు
ప్రతీ చెట్టుపై గట్టు పై ప్రకాశిస్తూ
పున్నమి నవ్వులను ప్రసాదిస్తున్నాడు
తదేకంగా చూస్తూ మైమరచి పోయే శరన్నవరాత్రి పాలసంద్రంలా అవనిని పరిపాలిస్తున్నాడు
నిరాశను పారద్రోలే స్నేహపు హస్తంలా
భుజాలను తట్టే భరోసాలా
నీ ముందే నిలుచుని కాంతి జిమ్ముతున్నాడు
పరవశమో వివశమో వివరాలేమీ అడుగడు
నీవు చెప్పినా వినడు
పుడమి నుంచి ఎన్ని వేడుకోళ్లు ఎన్ని వేదనలు ఎన్ని తాపములు ఎన్ని నిట్టూర్పులు...ఏవీ పట్టని రారాజు... ఎప్పటికీ అవే దరహాసచంద్రికలు
