STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

తిలక్

తిలక్

1 min
1

తిలక్
(వచన కవిత)

దేవరకొండ బాలగంగాధర తిలక్ అను నాధునిక కవి.
పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన చైతన్య దీపకుడు.

చిన్ననాటి నుండి కవిత్వము పట్ల ఆకర్షితుడైనాడు.
నన్నయాదుల వంటి పూర్వ కవులనారాధించినాడు.

క్రమముగా పద్యకవిత్వములో పట్టు సాధించినాడు.
అనారోగ్యముతో కూడా పుస్తకాల మధ్య గడిపెడివాడు.

పద్యములతో ఖండకావ్యములనేకము రచించినాడు.
 మనసును మథించి కవిత్వమును సృజంచెడివాడు.

భావ కవిత్వమును తనదైన శైలిలో రచించినవాడు.
సునిశతమైన దృష్టితో కవిత్వము నవలోకించినాడు.

సూటిగా ధాటిగా తన భావాలను ప్రకటించిన ధీరుడు.
సమాజ శ్రేయస్సుకై సతతము తపించిన కవి పుంగవుడు.

అమృతం కురిసిన రాత్రితో తిలక్ యజరామరుడయినాడు.
మరణానంతరమా కవి ప్రతిభ లోకానికంతటికి తెలిసింది.

కేంద్ర సాహిత్య పురస్కారాన్ని సాధించి పెట్టిన కవిత్వమయింది.
తిలక్ ఖ్యాతి సాహితీ వినీలకాశంలో చిరస్థాయిగా నిలిచింది.//


Rate this content
Log in

Similar telugu poem from Classics