తీయని రాగాలు
తీయని రాగాలు
ప౹౹ జాబిలితో చెప్పకు జాగుచేయును మత్తుగా జావళీగా పాడవా గుండెనే చేరును గుర్తుగా ౹2౹
చ౹౹ అలనాటి అలకలే కిలకిల చేసి ఆలపించవా తొలినాటి కోరికకు తొలకరియై గెలిపించవా ౹2౹
మరుజన్మకు మరువని రాగాలే పలికించవా మరులన్నీ మూటగనే మదిలో తలపించవా ౹ప౹ చ౹౹
కాదేది అనర్హం ఏ కవితలో ఎంచి చూసినా పోదేది ప్రేమలో ఆ ఎదలోనే పరవసించినా ౹2౹
పారవశ్యమే పలుకునే చిరు ప్రేమై నిండుగ ఆవశ్యకమై అదనులోనే అందునే పండుగ ౹ప౹ చ౹౹
తీయని రాగాలే తీరైన బంధమే తనువులో కోయని పలికే కోయిలై చేరే అణవణువులో ౹2౹
పలుకే బంగారమయి పల్లవించిలే పల్లవిలో అలుకే సింగారంగా అలరించే ప్రేమపల్లకీలో ౹ప౹