తీయని హృదయం
తీయని హృదయం


తియ తీయని హృదయాన్ని ఇద్దామనుకున్నా
లబ్ డబ్ లే నిను విసిగిస్తాయని ..మానేస్తున్నా
తెల తెల్లని సూర్యకిరణాలే ఇద్దామనుకున్నా
ఒహొహో... నీ కళ్శ కాంతికే దీటేరాదంటున్నా
నువ్వే ఒద్దికగా వచ్ఛే తీరుకే
ఆమని మురిసింది ఆశతో
నువ్వే కదిలేటి అలికిడికే
గాలి గంధం అద్దుకుంది చూడవే
సోయుగాల సొగసుకత్తెకు ఏమివ్వనే
తియ తీయని హృదయాన్ని ఇద్దామనుకున్నా
లబ్ డబ్ లే నిను విసిగిస్తాయని...మానేస్తున్నా
ఒహొహో హరివిల్లుకు అందని వర్ణం నువ్వులే
ఎన్ని రంగులు ఎదురుగా పెట్టినా సరిపోవులే
కొంటె కోరికలతో మెరిసే కళ్ళు నీవిలే
ఆ కళ్ళకు హంగులు ఎందుకు అద్దాలిలే
చెక్కలిపై చక్కని ముద్దు పెడతారులే
నీకైతే తనువంతా ముద్దులు పెట్టాలిలే
రాదిక సమయమని ఎంతో వేచాను ఆశగా
కాదిక ఇవ్వాలి బహుమతినని బ్రతిమాలాడాను ఆర్తిగా
కనుకే మనసంతా మైనం చేసాను హారతిగా ఇచ్చేందుకు
తియ తీయని హృదయాన్ని ఇద్దామనుకున్నా
లబ్ డబ్ లే నిను విసిగిస్తాయని...మానేస్తున్నా
ఒహొహో ..
కమ్మనైన చూపులో ఒలికే తీపివి నువ్వులే
ఆ తీపికి మారుగా ఏమి ఇవ్వాలిలే
గుండెల్లోకి గురిపెట్టే ధైర్యం నీవేలే
ఆ గురినే గురుతుగా చేసి ఏమి ఇవ్వాలిలే
మనసెరిగిన మన్మధుడు మనలను కలిపాడులే
వివరమెరిగిన ఆ కాముడికి నేనేమి తిరిగి ఇవ్వాలిలే
రాదిక సమయమని ఎంతో వేచాను ఆశగా
కాదిక ఇవ్వాలి బహుమతినని బ్రతిమాలాడాను ఆర్తిగా
కనుకే మనసంతా మైనం చేసాను హారతిగా ఇచ్చేందుకు
తియ తీయని హృదయాన్ని ఇద్దామనుకున్నా
లబ్ డబ్ లే నిను విసిగిస్తాయని ..మానేస్తున్నా